నిర్మాతగా మారుతున్న పవన్ హీరోయిన్ | Actress Pranitha to turn Producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న పవన్ హీరోయిన్

Published Sat, May 13 2017 10:48 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నిర్మాతగా మారుతున్న పవన్ హీరోయిన్ - Sakshi

నిర్మాతగా మారుతున్న పవన్ హీరోయిన్

హీరోయిన్గా టాప్ హీరోల సరసన సినిమాలు చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోయిన్ ప్రణీత సుభాష్. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. ప్రణీతకు రావాల్సిన స్ధాయిలో గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు టాటా చెప్పేసిన ఈ భామ తమిళ కన్నడ సినిమాల మీద దృష్టి పెట్టింది. అక్కడ అవకావాలు బాగానే వస్తున్న స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

దీంతో బిజినెస్ మీద దృష్టి పెట్టిన ప్రణీత, హోటల్ రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించింది. అదే జోరులో ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉంది. హీరోయిన్ గా కొనసాగుతూనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాతగా మారేందుకు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందట. త్వరలోనే తన  బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాపై ప్రకటన చేయనుంది.. ఈ సాండల్వుడ్ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement