నగరంలో ప్రణీత | Pranitha Visit Visakhapatnam | Sakshi
Sakshi News home page

నగరంలో ప్రణీత

Published Sat, Jun 30 2018 11:44 AM | Last Updated on Sat, Jun 30 2018 11:44 AM

Pranitha Visit Visakhapatnam - Sakshi

రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్న సినీనటి ప్రణీత

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నగరంలో సినీనటి ప్రణీత(అత్తారింటికి దారేది ఫేం) శుక్రవారం సందడి చేశారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన ఆమె సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో కలిసి నగరంలో తళుక్కున మెరిశారు. ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుని ముచ్చటపడ్డారు. అనంతరం వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన సోమ రెస్టోబార్‌ను ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘హాలో గురు ప్రేమ కోసమే రా’చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తన తొలి హిందీ చిత్రం పాట శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశామని, 5 మిలియన్ల మంది వీక్షించటం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరంలో మంచి ఫుడ్‌ కోసం యువత ఎంతో ఆసక్తి కనబరుస్తారని, వారి అభిరుచులకు అనుగుణంగా ఆహారం అందించి సోమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ లోకనాథ్, నటుడు రాంకీ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement