సిటీబ్యూరో : రవీంద్ర భారతిలో సాయంత్రం 7 గంటలు. అయిదో తరగతి చదువుతున్న పదేళ్ల పరిణీత స్టేజీపై గంతలు కట్టుకొని ఏదో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు టెన్షన్‌తో కన్నార్పకుండా చూస్తున్నారు. ప్రేక్షకులూ కంగారుగా వీక్షిస్తున్నారు. ఆ అమ్మాయి 60 సెకన్లలో 101 ఫ్లాష్‌కార్డులపై ఉన్న అక్షరాలు చదివింది. సభంతా చప్పట్లతో మారుమోగింది... ఎందుకనుకుంటున్నారా? ప్రణీత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వరల్డ్ రికార్డులు సృష్టించింది.
శుక్రవారం బాల సాహిత్య పరిషత్, ఇంపాక్ట్ మైండ్ యాక్టివేషన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని కేవలం మనసుతో అక్షరాలను గుర్తుపట్టిన పరిణీత లిమ్కా బుక్, యూనిక్ వరల్డ్, వండర్ వరల్డ్ స్టేట్ బుక్, స్టార్ బుక్, లిటిల్ బుక్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ హాజరయ్యారు. ప్రముఖ మిమిక్రీ సింగర్ ఎల్. వెంకటేశ్వర్లు తన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.
సంతోషంగా ఉంది..
నేను వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు గాదె పవణ్‌కుమార్, గాదె లలిత నన్ను ప్రోత్సహించి ఇలా రికార్డులు సాధించేలా తయారు చేశారు. వారితో పాటు నాకు బ్లైండ్ ఫోల్డెడ్ బ్రిలియన్స్‌లో శిక్షణ ఇచ్చిన డాక్టర్ బి. సాయికిరణ్, హితేశ్ గారికి ధన్యవాదాలు. - గాదె పరిణీత
10 ఏళ్ల చిన్నారి.. 7 వరల్డ్ రికార్డులు
Published Fri, Feb 20 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement