భారీ బడ్జెట్‌ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ | Trisha First Look Out Now Vidaamuyarchi | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్‌ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Jul 19 2024 6:56 PM | Updated on Jul 19 2024 7:57 PM

Trisha First Look Out Now Vidaamuyarchi

నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్‌ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్‌ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్‌ లుక్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. ఓ రెస్టారెంట్‌లో త్రిష‌తో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేక‌ర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్‌కు సతీమణిగా ఆమె కనిపించనుంది.

కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్‌ హాట్‌గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్‌, విజయ్‌ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement