
తెలుగు తెరపై మెరవబోతున్న మరో పరభాష బ్యూటీ సోనాక్షీ సింగ్ రావత్. రాజస్థాన్‌లో పుట్టి, ముంబైలో చదువుకుని, ‘నా లవ్ స్టోరీ’ ద్వారా తెలుగు స్క్రీన్‌కి పరిచయం కాబోతున్నారామె. శివ గంగాధర్ దర్శకత్వంలో మహిధర్, సోనాక్షీ సింగ్ జంటగా జి. లక్ష్మీ నిర్మించిన ‘నా లవ్ స్టోరీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. సోనాక్షీ సింగ్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం బిజినెస్ మేనేజ్‌మెంట్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. 16వ సంవత్సరంలోనే మోడలింగ్‌లోకి ఎంటరయ్యా. హీరోయిన్‌గా ‘నా లవ్ స్టోరీ’ నా ఫస్ట్ మూవీ. ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు.
ట్రైనింగ్ తీసుకుంటే నటన రాదని, క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని అప్పటికప్పుడు లొకేషన్‌లో చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ సినిమాకి చాలామంది హీరోయిన్లను ఆడిషన్స్ చేశారని విన్నాను. ఎవరూ నచ్చలేదని తెలిసి, నా ఫొటోలు పంపాను. నచ్చి హీరోయిన్‌గా ఓకే చేశారు. ఇందులో నాది మధ్యతరగతి అమ్మాయి పాత్ర. తండ్రి చాలా స్ట్రిక్ట్. రియల్ లైఫ్‌లో మా నాన్నగారు అలా కాదు. ఇక, ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్ గురించి చెప్పాలంటే... ఫస్ట్ డే రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డేనే రొమాంటిక్ సాంగ్ అనడంతో కొంచెం కంగారు, కొంచెం భయం అనిపించాయి. యూనిట్ సహకారంతో చేశాను. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌గార్లంటే ఇష్టం. ‘బాహుబలి’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలు చూశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment