mahidhar
-
విలువలున్న ప్రేమకథ
మహీదర్, శ్రావ్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంతో రచయిత భారతీబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నైతిక విలువలున్న ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో భానుచందర్ చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటేశ్వర్. -
యూనివర్సల్ లవ్‌స్టోరీ
‘‘యూత్‌ఫుల్ లవ్ ఎంటరై్టనర్స్కు ఆడియన్స్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను అలరించే అంశాలు, కాస్త ఎమోషన్, మరికాస్త సెంటిమెంట్ కలపి దాన్ని ప్రేమకథకు ముడేస్తే హిట్ మెటీరియల్. అలాంటి అంశాలతో వస్తోన్న సినిమానే ‘నా లవ్ స్టోరీ’ అని దర్శకుడు శివ గంగాధర్ అన్నారు. మహిధర్, సోనాక్షి సింగ్ జంటగా జి.లక్ష్మి నిర్మించిన ‘నా లవ్ స్టోరీ’ ఈరోజు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. కథే హీరో. యూత్‌కి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ లవ్‌స్టోరీ ఇది. మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. హీరోతో మొదలయ్యే లవ్ స్టోరీ హీరోయిన్‌తో ఎండ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకూ రాని పాయింట్. మా సినిమా చూస్తే పేరెంట్స్ మారతారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కొంచెం కంగారు.. కొంచెం భయం
తెలుగు తెరపై మెరవబోతున్న మరో పరభాష బ్యూటీ సోనాక్షీ సింగ్ రావత్. రాజస్థాన్‌లో పుట్టి, ముంబైలో చదువుకుని, ‘నా లవ్ స్టోరీ’ ద్వారా తెలుగు స్క్రీన్‌కి పరిచయం కాబోతున్నారామె. శివ గంగాధర్ దర్శకత్వంలో మహిధర్, సోనాక్షీ సింగ్ జంటగా జి. లక్ష్మీ నిర్మించిన ‘నా లవ్ స్టోరీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. సోనాక్షీ సింగ్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం బిజినెస్ మేనేజ్మెంట్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. 16వ సంవత్సరంలోనే మోడలింగ్‌లోకి ఎంటరయ్యా. హీరోయిన్గా ‘నా లవ్ స్టోరీ’ నా ఫస్ట్ మూవీ. ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదు. ట్రైనింగ్ తీసుకుంటే నటన రాదని, క్యారెక్టర్ని అర్థం చేసుకుని అప్పటికప్పుడు లొకేషన్లో చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ సినిమాకి చాలామంది హీరోయిన్లను ఆడిషన్స్ చేశారని విన్నాను. ఎవరూ నచ్చలేదని తెలిసి, నా ఫొటోలు పంపాను. నచ్చి హీరోయిన్గా ఓకే చేశారు. ఇందులో నాది మధ్యతరగతి అమ్మాయి పాత్ర. తండ్రి చాలా స్ట్రిక్ట్. రియల్ లైఫ్‌లో మా నాన్నగారు అలా కాదు. ఇక, ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్ గురించి చెప్పాలంటే... ఫస్ట్ డే రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డేనే రొమాంటిక్ సాంగ్ అనడంతో కొంచెం కంగారు, కొంచెం భయం అనిపించాయి. యూనిట్ సహకారంతో చేశాను. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్గార్లంటే ఇష్టం. ‘బాహుబలి’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలు చూశాను’’ అన్నారు. -
నిర్మాత అవుదామనుకొన్నా...
అశ్వినీ క్రియేషన్స్ పతాకంపై జి.లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. శివ గంగాధర్ దర్శకత్వంలో మహీధర్, సోనా„ì సింగ్ రావత్‌లు నాయకా నాయికలుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో మహీధర్ మాట్లాడుతూ– ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఢిల్లీ, హర్యానాలలో జాబ్ చేశాను. సినిమా మీద ఇంట్రస్ట్‌తో అవన్నీ మానేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు భిక్షు గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. మా అమ్మగారికి ‘సాహితీ పబ్లికేషన్స్’ అనే పబ్లిషింగ్ సంస్థ ఉంది. మా పబ్లికేషన్‌లో పెద్ద వంశీగారి ‘మా పసలపూడి కథలు’, ఆర్జీవీగారి ‘నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ’ తదితర ఎన్నో పుస్తకాలను ముద్రించాము. ఇవికాక మాకు వేరే బిజినెస్‌లు ఉన్నాయి. మొదట నేను నిర్మాత అవుదామనుకొన్నా. పబ్లిషింగ్ రంగంలో ఉండటం వల్ల ఎప్పుడూ రచయితలు, దర్శకులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని. అలా నాకు దర్శకుడు శివగారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు ఓ కథ చెప్పటం, నాకు సినిమా చేయాలనిపించటం, నేను నటనలో శిక్షణ తీసుకున్నానని చెప్పటం, ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఆఫర్ ఇవ్వటం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే... ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క అబ్బాయి ఎదుర్కొంటున్న సమస్యే. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకపోవటం, అక్కడినుండి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమవ్వటం, ఆ తర్వాత ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ ఎలా నడుస్తుందనేది కథ. సినిమాలో నేను ఉద్యోగం చేయకుండా ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో నటించాను. సంగీత దర్శకుడు వేద నివాస్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పాటలన్నీ బాగున్నాయి. నిర్మాత శేషగిరిరావుగారు మా టీమ్‌ను నమ్మి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా మొత్తం మీద రెండుసార్లు సెట్‌కి వచ్చారాయన. తోటపల్లి మధుగారు, శివన్నారాయణగారు, చమ్మక్ చంద్రలు అందరికీ సుపరిచితులే. మిగతా అంతా కొత్తవారితో చేశాం. భారతీబాబు గారితో మరో సినిమాలో హీరోగా చేస్తున్నాను. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఆ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ నెల 29వ తేదీన ‘నా లవ్ స్టోరీ’ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేమకు క్లారిఫికేషన్
మహిధర్, సోనాక్షీ సింగ్ రావత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శివగంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. అశ్వని క్రియేషన్స్ పతాకంపై జి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివగంగాధర్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో అడుగు పెడుతున్న యూత్‌కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా ప్రేమలో పడేవాళ్లకి, ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చే చిత్రమిది.‘అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా, పెళ్ళి చూపులు’ లాంటి నేచురల్ లవ్ స్టోరీ. ప్రేమలో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించాం. కొత్త వాళ్లైనా బాగా చేశారని సినిమా చూశాక ప్రేక్షకులే అంటారు’’ అన్నారు. ‘‘బొమ్మరిల్లు’ లాంటి క్యూట్ లవ్ స్టోరీ ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఇందులోని రెండు పాటలని నార్త్ బ్యాంకాక్‌లోని ‘చియాంగ్ మై’లో షూట్ చేశాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. శివన్నారాయణ, ‘చమ్మక్’ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వేదనివాన్, కెమెరా: కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. శేషగిరి రావు. -
నా ప్రేమ కథ
మహిధర్, సాక్షీసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. శివ గంగాధర్ దర్శకత్వంలో జి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. వేదనివాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ప్రముఖ రచయితలు శివశక్తి దత్త, భువనచంద్ర విడుదల చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం ట్రైలర్‌ని లాంచ్ చేశారు. దర్శకులు ప్రవీణ్ సత్తారు, సి.ఉమా మహేశ్వరరావు, రచయిత భారతీబాబు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ ఒక్కో పాటని విడుదల చేశారు. శివ గంగాధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో ఫాదర్‌గా చేసిన తోటపల్లిమధు, హీరోయిన్ ఫాదర్‌గా చేసిన శివన్నారాయణ, మహిధర్, సాక్షీసింగ్ నాలుగు పిల్లర్లు. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే చిత్రం. గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్ డ్రాప్లో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం. పైరసీ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితికి తెచ్చింది. దయచేసి పైరసీ చేయకండి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు మహిధర్. సాక్షీసింగ్, వేదనివాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కె. శేషగిరిరావు. -
ఈతరం సీతారాములు
మహిధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’. వెంకటేష్ కె. దర్శకత్వంలో ప్రశ్నాద్ తాతా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ– ‘‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని అందరూ ఎలా అనుకుంటారన్నది మా సినిమాలో చూపిస్తున్నాం. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటేష్ కె. ‘‘ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశా. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహిధర్. -
ఎడ్లబండి కింద పడి బాలుడు మృతి
మిడ్తూరు: ఎడ్ల బండిపై ఉన్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మిడ్తూరులో చోటు చేసుకుంది. గ్రామంలోని నీటి ఎద్దడి కారణంగా స్థానికులు సమీపంలోని చెరువు నుంచి డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన మార్ల శ్రీనివాసులు ఎడ్లబండిపై డ్రమ్ములు వేసుకుని చెరువు వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో కొడుకు మహీధర్(3) కుడా ఎండ్లబండి పై ఉండటంతో ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. బండి చక్రాలు అతనిపైగా వెళ్లటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
వేగమే యమపాశం
ఓఆర్ఆర్పై ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పై ఇద్దరు మృతి ఘటనలు అతివేగమే కారణమని తేల్చిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: అతి వేగమే ప్రాణాల్ని బలిగొంటోంది. సోమవారం ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మణం చెందారు. ఈ రెండు ప్రమాదాలకు మితి మీరిన వేగమే ప్రధాన కారణమని అధికారులు తేల్చారు. ఓఆర్ఆర్పై ఒకటి, రెండో లేన్‌లో వెళ్లాల్సిన కారు లేన్‌ను పాటించకపోవడంతో పాటు మరోపక్క అతివేగంతో వచ్చి ఆరో లేన్‌లో పార్క్ చేసిన లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎంవీవీ సూర్యనారాయణరావు భార్య నాగ రామలక్ష్మి (50), కుమార్తె సింధూర (19), బావ మహిధర్ (50) దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి వస్తున్న వీరి కారు ప్రమాద సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోతోంది. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైజరిగిన ప్రమాదంలో కారు డ్రైవర్ భాను (26)తో పాటు గౌతం (21) ప్రాణాలు కోల్పోయారు. వీరి కారు కూడా ప్రమాదం జరిగినప్పుడు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు గుర్తించారు. లారీ లేకుంటే ప్రమాద తీవ్రత తగ్గేది.. ఓఆర్ఆర్పై లారీ చెడిపోవడంతో నిబంధనల మేరకు ఆరో లేన్‌లో పార్క్ చేశారు. ఇది ఓఆర్ఆర్పై తిరిగే ట్రాఫిక్ పెట్రోలింగ్ మొబైల్-3 వాహనం గుర్తించలేదు. పెద్ద గోల్కొండ నుంచి రాజేంద్రనగర్ వరకు ఈ వాహనం పర్యవేక్షిస్తుంది. హిమాయత్‌సాగర్ వద్ద సిబ్బంది ఉదయం 9 గంటలకు డ్యూటీ మారుతుంటారు. సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద గోల్కొండలో ఉన్న ఈ మొబైల్ వాహనం ఘటనా స్థలం మీదుగా ఉదయం 8.30కి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ లారీ లేదు. ఈ వాహనం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యూటీ ఛేంజ్ పా యింట్ వద్దకు రాగానే ప్రమాద సమాచారం అందింది. ఆ ప్రాంతం లో లారీ లేకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని అధికారులు భావిస్తున్నారు. లారీ కోసం రాత్రి వరకు ఎవరూ రాకపోవడంతో పోలీసులే కాపలాగా ఉన్నారు. కాగా, ఓఆర్ఆర్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఓఆర్ఆర్ పైకి వాహనం ఎక్కేముందు టోల్గేట్ సిబ్బంది ఇచ్చే చిట్టీపై కూడా నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. ఇక, ఓఆర్ఆర్పై స్పీడ్ గన్లు శాశ్వతంగా ఏర్పాటు చేసి ఉంటే వేగం తగ్గించుకునే అవకాశముంది. కానీ ఔటర్‌పై మొబైల్ స్పీడ్ గన్లు మాత్రమే ఉన్నాయి. వీటిని ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో మాత్రమే వాడుతున్నారు.