మహిధర్, సోనాక్షీ సింగ్ రావత్
మహిధర్, సోనాక్షీ సింగ్ రావత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శివగంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. అశ్వని క్రియేషన్స్ పతాకంపై జి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివగంగాధర్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో అడుగు పెడుతున్న యూత్‌కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా ప్రేమలో పడేవాళ్లకి, ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చే చిత్రమిది.‘అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా, పెళ్ళి చూపులు’ లాంటి నేచురల్ లవ్ స్టోరీ.
ప్రేమలో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించాం. కొత్త వాళ్లైనా బాగా చేశారని సినిమా చూశాక ప్రేక్షకులే అంటారు’’ అన్నారు. ‘‘బొమ్మరిల్లు’ లాంటి క్యూట్ లవ్ స్టోరీ ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఇందులోని రెండు పాటలని నార్త్ బ్యాంకాక్‌లోని ‘చియాంగ్ మై’లో షూట్ చేశాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. శివన్నారాయణ, ‘చమ్మక్’ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వేదనివాన్, కెమెరా: కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. శేషగిరి రావు.
Comments
Please login to add a commentAdd a comment