మహీధర్
అశ్వినీ క్రియేషన్స్ పతాకంపై జి.లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. శివ గంగాధర్ దర్శకత్వంలో మహీధర్, సోనా„ì సింగ్ రావత్‌లు నాయకా నాయికలుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో మహీధర్ మాట్లాడుతూ– ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఢిల్లీ, హర్యానాలలో జాబ్ చేశాను. సినిమా మీద ఇంట్రస్ట్‌తో అవన్నీ మానేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను.
అప్పుడు భిక్షు గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. మా అమ్మగారికి ‘సాహితీ పబ్లికేషన్స్’ అనే పబ్లిషింగ్ సంస్థ ఉంది. మా పబ్లికేషన్‌లో పెద్ద వంశీగారి ‘మా పసలపూడి కథలు’, ఆర్జీవీగారి ‘నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ’ తదితర ఎన్నో పుస్తకాలను ముద్రించాము. ఇవికాక మాకు వేరే బిజినెస్‌లు ఉన్నాయి. మొదట నేను నిర్మాత అవుదామనుకొన్నా. పబ్లిషింగ్ రంగంలో ఉండటం వల్ల ఎప్పుడూ రచయితలు, దర్శకులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని. అలా నాకు దర్శకుడు శివగారితో పరిచయం ఏర్పడింది.
ఆయన నాకు ఓ కథ చెప్పటం, నాకు సినిమా చేయాలనిపించటం, నేను నటనలో శిక్షణ తీసుకున్నానని చెప్పటం, ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఆఫర్ ఇవ్వటం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే... ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క అబ్బాయి ఎదుర్కొంటున్న సమస్యే. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకపోవటం, అక్కడినుండి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమవ్వటం, ఆ తర్వాత ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ ఎలా నడుస్తుందనేది కథ. సినిమాలో నేను ఉద్యోగం చేయకుండా ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో నటించాను.
సంగీత దర్శకుడు వేద నివాస్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పాటలన్నీ బాగున్నాయి. నిర్మాత శేషగిరిరావుగారు మా టీమ్‌ను నమ్మి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా మొత్తం మీద రెండుసార్లు సెట్‌కి వచ్చారాయన. తోటపల్లి మధుగారు, శివన్నారాయణగారు, చమ్మక్ చంద్రలు అందరికీ సుపరిచితులే. మిగతా అంతా కొత్తవారితో చేశాం. భారతీబాబు గారితో మరో సినిమాలో హీరోగా చేస్తున్నాను. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఆ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ నెల 29వ తేదీన ‘నా లవ్ స్టోరీ’ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment