మహీధర్, సాక్షీసింగ్
మహిధర్, సాక్షీసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. శివ గంగాధర్ దర్శకత్వంలో జి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. వేదనివాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ప్రముఖ రచయితలు శివశక్తి దత్త, భువనచంద్ర విడుదల చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం ట్రైలర్‌ని లాంచ్ చేశారు. దర్శకులు ప్రవీణ్ సత్తారు, సి.ఉమా మహేశ్వరరావు, రచయిత భారతీబాబు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ ఒక్కో పాటని విడుదల చేశారు.
శివ గంగాధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో ఫాదర్‌గా చేసిన తోటపల్లిమధు, హీరోయిన్ ఫాదర్‌గా చేసిన శివన్నారాయణ, మహిధర్, సాక్షీసింగ్ నాలుగు పిల్లర్లు. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే చిత్రం. గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్ డ్రాప్‌లో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం. పైరసీ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితికి తెచ్చింది. దయచేసి పైరసీ చేయకండి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు మహిధర్. సాక్షీసింగ్, వేదనివాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కె. శేషగిరిరావు.
Comments
Please login to add a commentAdd a comment