
భానుచందర్
మహీదర్, శ్రావ్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘నటన’. ఈ చిత్రంతో రచయిత భారతీబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కుబేర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నైతిక విలువలున్న ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది.
యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో భానుచందర్ చేసిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రఘుబాబు, ప్రభాస్ శీను, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, కెమెరా: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటేశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment