∙శ్రీనివాస్, ప్రియాంక
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ క్యాదారి మాట్లాడుతూ– ‘‘ఏడాదిన్నరపాటు సతీష్ ఈ ప్రాజెక్ట్ కోసమే కష్టపడ్డాడు. ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
‘‘దర్శకుడిగా అవకాశం ఇచ్చిన లక్ష్మణ్‌కు రుణపడి ఉంటాను. మా సినిమా చూసిన వారందరూ ఎంతో మెచ్చుకున్నారు’’ అన్నారు సతీష్ చంద్ర నాదెళ్ల. ‘‘సరికొత్త పాయింట్‌తో కొత్త వారితో చేసిన మా సినిమా అందరి ఆదరణ పొందుతుందని నమ్మకంగా ఉంది’’ అని శ్రీనివాస్ అన్నారు. ‘‘కొత్త అమ్మాయినైనా మంచి సినిమాకు ఎంపిక చేసిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు ప్రియాంక. ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్, రవిరాజ్, పవన్ రమేష్, సన్ని, రోషన్, జైబోలో చంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: రవి.వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ మైలాపుర్.
Comments
Please login to add a commentAdd a comment