ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ క్లారిటీ! | Sonakshi Sinha on marriage with Bunty Sajdeh | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ క్లారిటీ!

Published Sat, Apr 1 2017 5:30 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ క్లారిటీ!

ప్రియుడితో పెళ్లి.. హీరోయిన్‌ క్లారిటీ!

నటి సోనాక్షి సిన్హా చాలాకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నదట. ప్రియుడు బంటీ సజ్‌దేతో ఆమె రిలేషిన్‌షిప్‌లో ఉన్నదని బాలీవుడ్‌ కోడై కూస్తున్నది. ఈ రూమర్స్‌ తగ్గట్టే ఇటీవల సోనాక్షి-బంటీ కలిసి పార్టీలకు వెళ్లడం, బహిరంగంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకు దొరికిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే సోనాక్షి-బంటీ ఒక ఇంటివారు కాబోతున్నారని, వారి పెళ్లి ఎంతో దూరంలో లేదంటూ కథనాలు కూడా వచ్చేశాయి.

తాజాగా 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సుందరాంగి తన పెళ్లి కథనాలపై స్పందించింది. 'త్వరలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో నాకు తెలియదు. ప్రజలను మాట్లాడుకోనివ్వండి. వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల పనే అది' అంటూ ఈ కథనాలను తోసిపుచ్చింది. అయితే, సోనాక్షి-బంటీకి మధ్య విభేదాలు వచ్చాయని, వారు వేరుగా ఉంటున్నారని ఆ మధ్య కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలను  ఖండించడానికి అన్నట్టుగా వెంటనే సోనాక్షి-బంటీ కలిసి అనుష్క శర్మ ఫిల్హౌరి స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అంతేకాకుండా జంటగా డైనింగ్‌ చేస్తూ ఫొటోలు దిగి.. లీక్‌ చేశారు. దీంతో వీరు ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement