డిన్నర్ డేటింగ్‌కు వెళ్లి దొరికిపోయారు!
డిన్నర్ డేటింగ్‌కు వెళ్లి దొరికిపోయారు!
Published Sat, Nov 5 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని గతకొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా వారిద్దరి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లి మీడియాకు చిక్కారు. వాళ్లే బాలీవుడ్ కొత్త జంట సోనాక్షి సిన్హా, బంటీ సజ్దే. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి.
కాగా, శుక్రవారం రాత్రి ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కు సోనాక్షి, బంటీ కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి కాసేపు రెస్టారెంట్‌లో గడిపారు. ఆ తర్వాతే ఎవరి కంటపడకుంగా గప్‌చుప్‌గా వెళ్లిపోవాలని మొదట సోనాక్షి బయటకు వచ్చింది. సోనాక్షి వెళ్లేవరకు రెస్టారెంట్‌లోనే వేచిచూసిన బంటీ.. ఆమె వెళ్లిపోయిన తర్వాత తాను నవ్వుతూ బయటకు వచ్చాడు.
సోనాక్షి, బంటీ మధ్య చాలాకాలంగా ప్రేమ నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఆ మధ్య వీరు విడిపోయినట్టు కూడా కథనాలు వచ్చాయి. ప్రియుడు బంటీ పెళ్లి ప్రతిపాదనను సోనాక్షి అంగీకరించిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోనుందని ‘ముంబై మిర్రర్’ మ్యాగజీన్ ఓ కథనం రాయగా.. దానిని సోనాక్షి తోసిపుచ్చింది. అయితే, తమ మధ్య బ్రేకప్ అయిన వార్తలు వట్టివేనని కొట్టిపారేయడానికి సోనాక్షి, బంటీ ఇలా రెస్టారెంట్‌కు వచ్చినట్టు భావిస్తున్నారు.
Advertisement
Advertisement