మామను ఫాలో అవుతున్న అల్లుడు | Dhanush follows father-in-law Rajinikanth's style in Maari | Sakshi
Sakshi News home page

మామను ఫాలో అవుతున్న అల్లుడు

Published Sat, May 23 2015 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

మామను ఫాలో అవుతున్న అల్లుడు

మామను ఫాలో అవుతున్న అల్లుడు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఓ స్టయిల్ ఐకాన్. స్టైలిష్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అన్నారు. సిగరెట్ గాల్లో ఎగరవేసే రజనీ స్టయిల్కు ఫిదా అయినవాళ్లు ఉన్నారు. తాజాగా రజనీ అల్లుడు, యువ హీరో ధనుష్ ...మామను అనుసరిస్తున్నాడు. కాగా రజనీ స్టయిల్ను ధనుష్ ఫాలో అవుతున్నాడని ఎప్పటి నుంచి టాక్ ఉంది. 'విఐపీ' సినిమాలో రజనీ స్టైల్స్ను అనుకరించాడు కూడా. ఈ మూవీ 'రఘువరన్ బీటెక్' పేరుతో తెలుగులోకి కూడా వచ్చింది.

అయితే నటన విషంయంలో ధనుష్ను ఎవ్వరూ వంక పెట్టలేరు. ఇటు కోలీవుడ్తో పాటు అటు బాలీవుడ్లో కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రజనీ స్టయిల్ను ధనుష్ అనుకరించడం మానుకోలేదని కోలీవుడ్లో ఇంకా గుసగుసలు వినిస్తున్నాయి.
రీసెంట్గా రిలీజైన 'మారీ' సినిమా టీజర్ అందుకు నిదర్శనం అంటున్నారు. ధనుష్ మళ్లీ మాస్ గెటప్లో రజనీలా సిగరెట్ కాలుస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక ధనుష్ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా రజనీని టాప్ ఆఫ్ డైలాగ్స్ చెబుతూ మతులు పోగొడుతుంది. సోనాక్షీ మెయిన్ రోల్లో ఓ లేడీ ఓరియెంటెండ్ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ తమిళ దర్శకుడికి రజనీ అంటే విపరీతమైన అభిమానం. ఈ డైరెక్టర్.. రజినీ స్టైల్లో సోనాక్షితో డైలాగ్ చెప్పించి నెట్లో ఉంచాడు. మొత్తానికి రజనీ మేనియా కోలీవుడ్, బాలీవుడ్లో నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement