కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్కురీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ఓ హోటల్‌లో తాజాగా జరిగింది. ఇందులో నటుడు కమల్‌హాసన్, దర్శకుడు భారతీరాజా, వెట్రిమారన్, ఆర్వీ ఉదయకుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ భావనను బట్టే జీవి తం అంటారన్నారు. దాన్ని తాను నమ్ముతానన్నారు. పలువురు రాత్రుల్లో నిద్ర పట్టకపోతే ఇళయరాజా పాటలను వింటూ నిద్రపోతారన్నారు. అయితే తాను పలు రాత్రుళ్లు ఇళయరాజాగా నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపానన్నారు. తాను ఇద్దరి బయోపిక్‌లలో నటించాలని ఆశ పడ్డానని, అందులో ఒకరు రజనీకాంత్ కాగా, మరొకరు ఇళయరాజా అనీ అన్నారు. అందులో ఇళయరాజా బయోపిక్‌లో నటించే కల నెరవేరుతోందని అన్నారు. ఈ అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీతమే తనకు అండ అని, ఇది అందరికీ తెలుసని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నటించడం ఛాలెంజ్, ప్రెజర్ అని అంటున్నారని, నిజానికి అలాంటిదేమీ లేదని, జాలీగా నటించడమేనని ధనుష్ పేర్కొన్నారు. అదేవిధంగా విడుదలై చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో తనను పాడమని ఇళయరాజా చెప్పినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగానన్నారు. అందుకాయన తాను ఎప్పుడు మీతో లేకుండా ఉండాను అని పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, నీరవ్‌షా ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment