అయోధ్య వివాదంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం లేదని శత్రుఘ్నసిన్హా అన్నారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం లేదని సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా అన్నారు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధికే ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
అయోధ్య భూ వివాదం కేసును అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాంతిసామరస్య పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో అయోధ్య అంశాన్ని మళ్లీ తెర మీదకు తేవడం సరికాద’ని అభిప్రాయపడ్డారు.