న్యూఢిల్లీ: పార్లమెంట్లో విపక్షాల మూకుమ్మడి దాడితో సతమతమవుతున్న బీజేపీకి.. సొంత పార్టీలోనే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. తరచూ సొంత పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే సినీ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా.. లోక్సభ నుంచి 25 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీల సస్పెన్షన్ విషయంలో ఆయన కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడారు.
'పార్లమెంట్లో పరిణామాలు బాధాకరం. 25 మంది ఎంపీ స్నేహితులను సస్పెండ్ చేశారు. వీరిలో ఒకరు సభకు రానేలేదు' అని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. ఇదిలావుండగా బీహార్ రాజధాని పాట్నా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిన్హా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీపై అసంతృప్తిగా ఉన్న శత్రుఘ్నసిన్హా.. సందర్భం వచ్చినప్పుడల్లా జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ప్రశంసిస్తుంటారు. నితీష్ కూడా సిన్హాను పొగుడుతుంటారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్కు బీజేపీ ఎంపీ మద్దతు!
Published Wed, Aug 5 2015 2:06 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM
Advertisement