న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఫిబ్రవరి 8న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అగ్ర నేతలు పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్, అమరీందర్ సింగ్‌లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు లభించిడం విశేషం. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రోమేష్ సబర్వాల్ తలపడనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment