
'ప్రత్యేక ప్యాకేజీని జిమ్మిక్కు అనుకున్నారు'
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగపూర్: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 53 సీట్లు గెలవడం ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమేనని శత్రుఘ్న సిన్హా అన్నారు.
బిహార్ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడాన్ని జిమ్మిక్లో భాగమని ప్రజలు భావించారని వ్యాఖ్యానించారు. అలాగే ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ను జంగిల్ రాజ్ అనడాన్ని బిహారీలు తట్టుకోలేకపోయారని శత్రుఘ్న సిన్హా చెప్పారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించగా, ఎన్డీయే పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.