సొంత పార్టీకి బీజేపీ ఎంపీ చురకలు | BJP MP Shatrughan Sinha calls for end to negative politics, mudslinging | Sakshi
Sakshi News home page

సొంత పార్టీకి బీజేపీ ఎంపీ చురకలు

Published Mon, May 22 2017 2:10 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

సొంత పార్టీకి బీజేపీ ఎంపీ చురకలు - Sakshi

సొంత పార్టీకి బీజేపీ ఎంపీ చురకలు

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వ్యతిరేక రాజకీయాలు చేయొద్దని, ప్రత్యర్థులపై బురద చల్లడం మానుకోవాలని బీజేపీకి సూచించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకు ఆయన బాసటగా నిలిచారు. తమ పార్టీ అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు సంధించారు.

‘నెగెటివ్‌ రాజకీయాలు ఇక చాలించండి. కేజ్రీవాల్‌, లాలూ యాదవ్‌ వంటి ప్రత్యర్థులను అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించడం మానుకోవాలి. నిజాయితీ, పారదర్శకత పట్ల మన పార్టీకి నమ్మకముంది. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదు. తగిన ఆధారాలు చూపగలిగితేనే ఆరోపణలు చేయండి. మీడియాలో సంచలనాల కోసం పాకులాడొద్ద’ని హితవు పలికారు. బిహార్‌లోని పట్నా లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శత్రుఘ్నసిన్హా.. లాలూకు మద్దతుగా ట్వీట్స్‌ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement