సోదరుడి డైరెక్షన్ లో సోనాక్షి సిన్హా!
తన తమ్ముడు కుష్ సిన్హా దర్శకత్వంలో నటించడానికి బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా సిద్ధమైంది.
తన తమ్ముడు కుష్ సిన్హా దర్శకత్వంలో నటించడానికి బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా సిద్ధమైంది. తన తమ్ముడి దర్శకత్వంలో యాడ్ ఫిల్మ్ లో నటించడానికి ఓకే చెప్పింది. గతంలో సంజయ్ లీలా భన్సాలీ చిత్ర 'సావరియా', అభినవ్ కాశ్యప్ దర్శకత్వం వహించిన 'బేషరమ్', 'దబాంగ్' చిత్రాలకు కుష్ సిన్హా అసిస్టెంట్ గా పనిచేశారు.
తాను రూపొందించబోయే యాడ్ సోనాక్షి అభిమానులను ఆకట్టుకుంటుందని కుష్ తెలిపారు. ఓ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన యాడ్ ను తాను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు. తన తండ్రి శతృఘ్న సిన్హా పేరిట నెలకొల్పిన షాట్ గన్ మూవీస్ బ్యానర్ పై ఈ యాడ్ ను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు.