
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు షోషించనున్నారు. ఈ సినిమాకు సోనాక్షీ సిన్హా సోదరుడు ఖుష్ సిన్హా దర్శకత్వం వహించనున్నారు.
ఖుష్ సిన్హాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘సోనాక్షీ సిన్హా మంచి ప్రతిభావంతురాలు. నటిగా ఆమె ఎదుగుదలను చూస్తూ పెరిగాను. ఇప్పుడు సోనాక్షీ కెరీర్‌లో నా వంతు భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఖుష్ సిన్హా.