Kush Sinha
-
సోదరుడి దర్శకత్వంలో సోనాక్షీ సిన్హా కొత్త చిత్రం
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు షోషించనున్నారు. ఈ సినిమాకు సోనాక్షీ సిన్హా సోదరుడు ఖుష్ సిన్హా దర్శకత్వం వహించనున్నారు. ఖుష్ సిన్హాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘సోనాక్షీ సిన్హా మంచి ప్రతిభావంతురాలు. నటిగా ఆమె ఎదుగుదలను చూస్తూ పెరిగాను. ఇప్పుడు సోనాక్షీ కెరీర్లో నా వంతు భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఖుష్ సిన్హా. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సోదరుడి డైరెక్షన్ లో సోనాక్షి సిన్హా!
తన తమ్ముడు కుష్ సిన్హా దర్శకత్వంలో నటించడానికి బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా సిద్ధమైంది. తన తమ్ముడి దర్శకత్వంలో యాడ్ ఫిల్మ్ లో నటించడానికి ఓకే చెప్పింది. గతంలో సంజయ్ లీలా భన్సాలీ చిత్ర 'సావరియా', అభినవ్ కాశ్యప్ దర్శకత్వం వహించిన 'బేషరమ్', 'దబాంగ్' చిత్రాలకు కుష్ సిన్హా అసిస్టెంట్ గా పనిచేశారు. తాను రూపొందించబోయే యాడ్ సోనాక్షి అభిమానులను ఆకట్టుకుంటుందని కుష్ తెలిపారు. ఓ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన యాడ్ ను తాను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు. తన తండ్రి శతృఘ్న సిన్హా పేరిట నెలకొల్పిన షాట్ గన్ మూవీస్ బ్యానర్ పై ఈ యాడ్ ను రూపొందిస్తున్నట్టు కుష్ తెలిపారు.