దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా! | Shatrughan Sinha invites Rajinikanth to join politics, start party | Sakshi
Sakshi News home page

దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా!

Published Thu, May 25 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా!

దేశం ఎదురుచూస్తోంది.. రజనీ రా!

సినిమాల్లోంచి రాజకీయాలలోకి వచ్చిన హీరోలలో షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా ఒకరు. 1986లో వచ్చిన అస్లీ నక్లీ అనే సినిమాలో ఆయన రజనీకాంత్‌తో కలిసి నటించారు. ఇప్పుడు అదే శత్రుఘ్న సిన్హా.. తన పాతమిత్రుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని పిలుస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ఏ పార్టీలోనూ చేరొద్దని, దానికి బదులు సొంత పార్టీ పెడితే మిగిలినవాళ్లంతా వచ్చి అందులో చేరుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుసపెట్టి ట్వీట్లు చేశారు. ''టైటానిక్ హీరో ఆఫ్ తమిళనాడు అండ్ సన్ ఆఫ్ ఇండియా.. డియరెస్ట్ రజనీకాంత్, సరైన సమయం ఇదే, కమాన్ లే. దేశం నీకోసం ఎదురుచూస్తోంది. సూపర్‌స్టార్ రజనీ ఎప్పుడు నిర్మాణాత్మక రాజకీయాలలోకి వస్తారా అని, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు'' అని ఆయన అన్నారు. దేవుడు శాసిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఇంతకుముందు రజనీకాంత్ చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధం వచ్చినప్పుడు పిలుస్తానని, అప్పటివరకు ఎవరి పనుల్లో వాళ్లు ఉండాలని అభిమానులతో ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో బీజేపీకి కొంత దూరంగా ఉంటూ వస్తున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా.. ఇప్పుడు రజనీకాంత్‌ను ఏ పార్టీలోనూ చేరొద్దని చెప్పడం విశేషం. ఒకవైపు ఆయన బీజేపీలో చేరుతారని, లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కథనాలు వస్తున్న తరుణంలో స్వయంగా బీజేపీ ఎంపీ అయి ఉండి సొంతంగా పార్టీ పెట్టుకోవాలి తప్ప ఎందులోనూ చేరద్దని శత్రుఘ్న చెప్పారు. ''ప్రజలంతా నీతో ఉన్నారు, సూపర్‌స్టార్ రజనీతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరితోనైనా చేరడానికి బదులు వాళ్లే వచ్చి నీతో చేరితే బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, నిపుణులను సంప్రదించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎంత త్వరగా అయితే అంత మంచిది'' అని కూడా శత్రుఘ్న సిన్హా సూచించారు. ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా తాను ఎప్పుడూ రజనీకాంత్‌కు అండగా ఉంటానని, ఆయనకు అన్నిరకాలుగా మద్దతివ్వడంతో పాటు రాజకీయాల్లో గైడ్ చేస్తానని తెలిపారు. తనను నమ్మొచ్చని, ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతూ చివర్లో 'లాంగ్‌లివ్ సూపర్‌స్టార్ రజనీ' అని ముగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement