న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఇది చారిత్రక, విప్లవ యాత్రగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్‌గా ఎదిగారని కొనియాడారు. గతంతో పోలిస్తే ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందన్నారు. కొందరు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయాలను చూస్తున్నారని, కానీ దేశంలోనే అత్యంత పట్టుదల నాయకుడిగా ఎదిగారాని పేర్కొన్నారు.
‘రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉంది. ఆయన కుటుంబం నుంచి పలువురు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సంఖ్యాపరంగా చూసుకుంటే 2024లో మమతా బెనర్జీ గేమ్ ఛేంజర్‌గా మారనున్నారు. మమతా బెనర్జీ ఒక ఉక్కు మహిళ, ప్రస్తుతం ఆమెను ఎవరూ తేలికగా తీసుకోలేరు.’అని పేర్కొన్నారు సిన్హా.
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ చేపట్టిన రథ యాత్ర, మాజీ ప్రధాని చంద్రశేఖరన్ చేపట్టిన యాత్రలతో భారత్ జోడో యాత్రను పోల్చారు శత్రుఘ్న సిన్హా. 2024 ఎన్నికలపై భారత్ జోడో యాత్ర కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నారు. ప్రధాని ఎవరనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని, విభిన్న రాజకీయ పార్టీల ప్రజలంతా ఏకతాటిపైకి వస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 75 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్తు కనెక్షన్.. సంతోషంలో ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment