
'శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోండి'
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి పార్టీ పెద్దలను కోరారు.
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి పార్టీ పెద్దలను కోరారు. శత్రుఘ్న సిన్హా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినా ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. శత్రుఘ్న సిన్హా ఇటీవల పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శత్రుఘ్న సిన్హా దూరంగా ఉన్నారు. సోమవారం బిహార్ సీఎం నితీష్ కుమార్ను కలిసి అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదని, తనపై చర్యలు తీసుకున్నా ఆపలేనని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.