uma bharati
-
‘రాహుల్ గాంధీ వల్లే ఈ రాజకీయ సంక్షోభం’
న్యూఢిల్లీ: సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్ రాజకీయాలపై బీజేపీ నాయకురాలు ఉమా భారతి స్పందించారు. రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని యువ నేతలను రాహుల్ గాంధీ ఎదగనీయడంలేదన్నారు. ప్రస్తుతం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలకు రాహులే కారణమని ఆమె విమర్శించారు. ‘విద్యావంతులు, ఆదరణ ఉన్న నేతలైన సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారికి ఉన్నత పదవులు ఇస్తే తనకు ఆదరణ తగ్గుతుందన్న అభద్రతా భావంలో రాహల్ గాంధీ ఉన్నారు’ అని ఉమా భారతి ఎద్దేవా చేశారు. (ప్రియాంక రాయబారం : మెత్తబడిన పైలట్) ఇదిలా ఉండగా జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీలో పాల్గొనేది లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాటలు అబద్ధమని అన్నారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. గహ్లోత్‌కు 102 ఎమ్మెల్యేల మద్దతు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ వెల్లడించారు. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, సీఎల్పీ భేటీ అనంతరం రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. -
నేడు సీబీఐ కోర్టుకు అద్వానీ, జోషీ
-
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్
-
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరించాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2014 ఏప్రిల్ నాటి అంచనా వ్యయాన్నే కేంద్రం భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు... ఉమాభారతి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం... 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుంది. ఆ రోజుకు సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చు వరకే ఇది పరిమితం. ఏప్రిల్ 2014 నాటి ధరల ప్రకారం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం పెరిగితే.... ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఉమా భారతి స్పష్టం చేశారు. కాగా రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని కరాఖండిగా చెప్పడం ఏపీ సర్కార్‌కు నిరాశే మిగిల్చింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఏప్రిల్ 1, 2014 నుంచి చేసిన ఖర్చును మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తామని స్పష్టం చేసింది. ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా రుణం ఇప్పిస్తామని తేల్చిచెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ ప్రతిపాదనలు పంపింది. ఏటా ధరల సర్దుబాటు కింద పది శాతం అంచనా వ్యయం పెరుగుతుందని.. 2019 నాటికి అంచనా వ్యయం రూ.42 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదించింది. ఏప్రిల్ 1, 2014 నుంచి గత ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3,762.52 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలా అరకొరగానే కేటాయింపులు చేస్తూ.. 2019 నాటి పోలవరంను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అలా పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభు త్వ అంచనాల ప్రకారమే మరో రూ.33 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.9 కోట్లు. మరోవైపు నాబార్డు రుణం మంజూరు అనుమానాస్పదమే. -
కేంద్రమంత్రి ఉమాభారతికి అరెస్టు వారెంట్, స్టే
భోపాల్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతిపై గురువారం మధ్యప్రదేశ్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వేసిన పరువునష్టం దావా కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడంలో ఉమా జాప్యం చేస్తున్న నేపథ్యంలో కోర్టు తొలుత ఆమెకు వారెంట్ ను ఇచ్చింది. తర్వాత కేసులో ఉమాభారతికి ఇచ్చిన వారెంట్ పై స్టే విధించినట్లు పేర్కొంది. అక్టోబర్ 19న కేసు మరోసారి విచారణకు రానుండటంతో ఉమ ఖచ్చితంగా కోర్టుకు హజరయ్యేలా చూడాలని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ)కు కేసు విచారించిన న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. 2003లో మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 10ఏళ్ల పాటు పనిచేసిన దిగ్విజయ్ సింగ్ హయాంలో రూ.15వేల కోట్ల అవినీతి జరిగిందని ఉమా భారతి స్టేట్ మెంట్ ఇచ్చారు. దాంతో దిగ్విజయ్ గత ఏడాది మార్చిలో ఉమా భారతిపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుపై మధ్యప్రదేశ్ న్యాయస్ధానంలో పలుమార్లు విచారణ జరిగింది. ఈ ఏడాది ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉమాభారతి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. రాజీకి దరఖాస్తు చేసుకుని కూడా ఉమ ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో గత ఏడాదిగా కేసు విచారణకు ఉమా హాజరుకాకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది. కాగా, ఈ కేసులో దిగ్వజయ్ సింగ్ ఇప్పటికే కోర్టులో తన వాంగ్మూలాన్ని సమర్పించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశానట్లు కోర్టులో ఒప్పుకుంటే కేసును వెనక్కుతీసుకుంటానని కూడా దిగ్విజయ్ ప్రకటించారు. -
ప్రారంభమైన అపెక్స్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శ్రమశక్తి భవన్‌లోని ఉమాభారతి చాంబర్లో ఈ భేటీ జరుగుతోంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. ఇది ఎజెండా: అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. -
పాలమూరు, డిండిపైనే దృష్టి!
అపెక్స్ కౌన్సిల్లో వీటిపైనే తొలి చర్చ - ఎజెండాకు కేంద్రమంత్రి ఉమాభారతి ఆమోదం - నేడు రాష్ట్రాలకు ఎజెండా కాపీలు - డీపీఆర్‌లు ఇవ్వకపోవడంపై ఏపీ, తెలంగాణలపై బోర్డు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులే ప్ర దాన అంశంగా అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల వనరుల శాఖ దీనికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. వీటిపై చర్చ ముగిసిన తర్వాత పట్టిసీమ, పోలవరం కింద తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటా, కృష్ణాలో ఏపీ ఉల్లంఘనలు, బోర్డు నియంత్రణపై, అలాగే ఏపీ తెరపైకి తెచ్చిన జూరాలలో నీటి వినియోగం, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశాలను చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమావేశ ఎజెండాకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఎజెండా కాపీలను కేంద్రం శనివారం ఉదయం పంపే అవకాశాలున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేం దుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలి సింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టీఎంసీలు తరలిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన రైతులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. నెలరోజుల్లోగా అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించాలంటూ జూలైలో కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే పాలమూరు డిండికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. 19లోగా డీపీఆర్‌లు ఇవ్వండి కృష్ణా జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలు కోరుతున్నా సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు సంబంధించి ఏపీ.. పాలమూరు, డిండి, కల్వకుర్తిలపై తెలంగాణ ప్రభు త్వం డీపీఆర్‌లను సమర్పించాలంటూ శుక్రవారం 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది. డీపీఆర్‌లు ఇవ్వకుంటే ఎలా స్పందించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో.. బోర్డు తుది హెచ్చరికగా రెండు రాష్ట్రాలకు ఈ లేఖలు పంపింది. ఈ నెల 19లోగా డీపీఆర్‌లు ఇవ్వాలని ఆదేశించింది. ఇరు రాష్ట్రాలు ఇచ్చే డీపీఆర్‌లనే అపెక్స్ కౌన్సిల్ ముందు పెడతామని స్పష్టం చేసింది. -
21న ఢిల్లీలో అపెక్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 21న న్యూఢిల్లీలో అపెక్స్ కమిటీ సమావేశం జరుగనుంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో కృష్ణా, గోదావరి జలాల వివాదంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హాజరుకానున్నట్టు సమాచారం. -
'శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోండి'
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి పార్టీ పెద్దలను కోరారు. శత్రుఘ్న సిన్హా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినా ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు. శత్రుఘ్న సిన్హా ఇటీవల పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శత్రుఘ్న సిన్హా దూరంగా ఉన్నారు. సోమవారం బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను కలిసి అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదని, తనపై చర్యలు తీసుకున్నా ఆపలేనని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. -
ఉమాభారతితో భేటీ కానున్న హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని ఆయన ఈ సందర్భంగా ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తాయి. దాంతో నీరు.... నిప్పుగా మారి ఇరు రాష్ట్రాల మధ్య వైరం పొడచూపుతుంది. శ్రీశైలం జల విద్యుత్‌పై కృష్ణా బోర్డు ఇచ్చిన తీర్పుపై గతంలో మంత్రి హరీష్ రావు ... కేంద్ర మంత్రి ఉమా భారతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. -
‘నర్మదా’ ఎత్తు పెంచుకోండి
17 మీటర్ల మేర డ్యామ్ ఎత్తు పెంపునకు గుజరాత్‌కు ఎన్సీఏ అనుమతి తీవ్రంగా వ్యతిరేకించిన నర్మదా బచావో ఆందోళన్ అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్సీఏ) అనుమతి మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో సమావేశమైన ఎన్సీఏ.. పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈ మేరకు అనుమతిచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ జునాగఢ్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. ఎప్పటి నుంచో డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఈ అనుమతి రావడం గమనార్హం. 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఇప్పుడు ఎత్తును పెంచడం ద్వారా.. ప్రస్తుత సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం వస్తుందని, రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చగలమని రాష్ట్ర ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ చెప్పారు. డ్యామ్‌కు 35 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచాల్సి రావడంతో నిర్మాణం పూర్తికావడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశముందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. అలాగే గుజరాత్, రాజస్థాన్‌లలో పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెంపునకు వ్యతిరేకంగా పోరాటం: మేధా పాట్కర్ డ్యామ్ ఎత్తు పెంపును నర్మదా బచావో ఆందోళన్(ఎన్బీఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. నర్మదా నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఈ సంస్థ చైర్పర్సన్ మేధా పాట్కర్ ముంబైలో మాట్లాడుతూ.. ఎత్తు పెంచాలన్న నిర్ణయం అప్రజాస్వామికమని, పెంపు వల్ల 2.5 లక్షల మంది నివాసముండే పలు ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, షాపులు, పంటలు ముంపునకు గురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మోడీ ప్రధాని అయ్యారు కాబట్టే దీనికి అనుమతి లభించిందన్నారు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. సామాజిక న్యాయశాఖ నివేదిక ఇచ్చాకే..: ఉమా భారతి ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం విషయంలో 100 శాతం సంతృప్తి వ్యక్తంచేస్తూ సామాజిక న్యాయ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాతే ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి గురువారం ఢిల్లీలో చెప్పారు. ప్రాజెక్టుతో సంబంధమున్న నాలుగు రాష్ట్ర్రాలనూ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. -
తప్పులో కాలేసిన ఉమా భారతి!
న్యూఢిల్లీ: ప్రజలకు చేరువ కావాలనే తాపత్రయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాజకీయ నాయకులు తొందరపాటులో తెలిసి తెలియక తప్పులో కాలేస్తున్నారు. తాజాగా అలాంటి తప్పిదంలో కేంద్రమంత్రి ఉమాభారతి చిక్కుకున్నారు. మంత్రి పదవుల కేటాయింపులపై అధికార ప్రకటన వెలువడకుండానే ఉమాభారతి అత్యుత్సాహంతో తనకు జలవనరులు, గంగా ప్రక్షాలన మంత్రిత్వ శాఖను కేటాయించారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసి ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు. వెంటనే తప్పు తెలుసుకున్న ఉమాభారతి ట్విట్ ను తొలగించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మంత్రిత్వ శాఖ కేటాయింపుపై అధికార ప్రకటన రాకుండానే తాను ప్రకటన చేయడం తప్పిదమే.. అని ట్విట్ చేసింది. అంతేకాక తన సహాయకుడు రాజేశ్ కటియార్ తన పాస్ వర్డ్ తీసుకుని ట్వీట్ చేశారని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆతర్వాత పోర్ట్ ఫోలియో గురించి ట్విట్ చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘించడమే. అందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ఉమా భారతి అకౌంట్ లో రాజేశ్ కటియార్ ట్విట్ చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై 'ఫైర్ బ్రాండ్' రాజకీయవేత్త విమర్శలకు గురయ్యారు. mere vibhag ki mujhe koi jankari nahi. mere sahayak rajesh katiyar ne mere password se galat twitt kiya hai. uske liye vo mafi mangege. — Uma Bharti (@umasribharti) May 26, 2014 मंत्रालय के बारे में मेरी गलती से ग़लत ट्वीट हो गया था, इसके लिए माफी माँगता हूं-राजेश कटियार — Uma Bharti (@umasribharti) May 26, 2014 -
నరేంద్ర మోడీ అంత పెద్ద వక్త కాదు: ఉమా భారతి
'నరేంద్ర మోడీ అంత గొప్ప వక్త కారు.ఆయన ప్రసంగాలు అంత ఉత్తేజకరంగా ఉండవు.' ఈ మాటలన్నది ఏ కాంగ్రెస్ నాయకుడో లేక ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడో కాదు. నరేంద్రమోడీ మద్దతుదారు, ఆయనకు ఆత్మీయురాలు అయిన ఉమా భారతి ఈ మాటలన్నది. 'మీరెప్పుడైనా నరేంద్ర మోడీ ప్రసంగించడం విన్నారా? ఆయన అంత పెద్ద వక్త కారు. బిజెపిలో నాటికీ, నేటికీ గొప్ప వక్త ఒక్కరే. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయీ. వాజ్ పేయీకి మోడీకీ పోలికెక్కడ" అని కూడా ఆమె అన్నారు. సోమవారం ఝాన్సీలో అన్న మాటలను ఆమె మంగళవారం కూడా రిపీట్ చేశారు. 'అంత గొప్ప వక్త కాకపోయినా మోడీ సభకు జనాలు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రజలు ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఆయన గొప్ప వక్త కాకపోయినా ప్రజలు ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు' అన్నారు ఉమాభారతి. ఉమా భారతి వ్యాఖ్యలతో బిజెపిలో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ 'నేనెప్పుడో చెప్పాను' అంటూ ఆనందపడిపోతోంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ 'మోడీ ప్రసంగాల్లో పెద్దగా సరుకేమీ ఉండదు. ఉట్టి ఊసుపోక మాత్రమే ఉంటుంది.' అంటున్నారు.