Shatrughan Sinha Said He Cannot Afford More than One Wife - Sakshi
Sakshi News home page

Shatrughan Sinha: ఒక్క భార్య ముద్దు, రెండో పెళ్లి.. మరో భార్య అంటే చాలా ఖర్చు!

Published Thu, Jan 19 2023 7:17 PM | Last Updated on Thu, Jan 19 2023 8:28 PM

When Shatrughan Sinha Said He Cannot Afford More Than One Wife - Sakshi

సినిమాల్లో సత్తా చాటిన శత్రుఘ్న సిన్హ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనేంటో నిరూపించుకున్నాడు. పాలిటిక్స్‌తో బిజీగా మారిన ఆయన ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క భార్య ముద్దు.. మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను తెచ్చుకోవద్దని మాట్లాడాడు.

'నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆమెను నేను పోషించలేను. కొందరు ఆడవాళ్లు నాదగ్గరకు వచ్చి నాపై ఆసక్తి చూపించేవారు. మన చుట్టూ ఎంత నీళ్లున్నా సరే వాటిలో నుంచి చుక్క నీటిని కూడా మనం తాగలేము అన్న వాక్యం గుర్తొచ్చేది. అయినా పెళ్లనేది ఒక్కరోజు తతంగం కాదు. అది మీరు ఎదగడానికి ఉపయోగపడాలి. వైవాహిక బంధంలో నిజాయితీ ఉండాలి, గౌరవం, ప్రేమ ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకర్నొకరు అర్థం చేసుకుని నమ్మకంగా మెదలాలి.

ప్రేమతో పాటు చిన్నచిన్న గొడవలు కూడా ఉంటాయి. అందరూ సింగిల్‌ లైఫే బాగుంటుందంటారు, కానీ పెళ్లి తర్వాత బాగుందనో, పెళ్లి జీవితం సంతోషంగా ఉందనో చెప్పరు. నా విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా నా భార్య సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో నా భార్యే ఎక్కువ నిజాయితీగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఈజీగా పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. ఈ విడాకుల వల్ల వారి కుటుంబంపై, పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్‌ పడుతుందో గ్రహించలేకపోతున్నారు' అని చెప్పుకొచ్చాడు.  కాగా శత్రుఘ్న సిన్హ, పూనమ్‌లు 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సోనాక్షి సిన్హ, లవ్‌, కుష్‌ సిన్హలు సంతానం.

చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్‌, ఫోటోలు వైరల్‌
స్టార్‌ ఇంట్లో అద్దెకు దిగిన యంగ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement