Bigg Boss Fame Pooja Mishra Accuses Shatrughan Sinha and His Family - Sakshi
Sakshi News home page

Pooja Mishra: నన్ను సెక్స్‌ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు

Published Thu, May 5 2022 5:46 PM | Last Updated on Thu, May 5 2022 7:12 PM

Bigg Boss 5 Contestant Pooja Mishra Alleging Shatrughan Sinha and His Family - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ పూజా మిశ్ర నటుడు, టీఎమ్‌సీ నాయకుడు శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై చేతబడి చేసి స్పృహ లేని సమయంలో తన కన్యత్వాన్ని వ్యాపారం చేశారని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. '17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తూనే ఉంది. మా నాన్న అతడికి కోట్లాది రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే తను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. నేనెక్కడ పాపులర్‌ అవుతానో అని భయపడ్డాడు.

ఓసారి నేను శత్రుఘ్న సిన్హాకు బర్త్‌డే విషెస్‌ చెప్దామని వెళ్లాను. అప్పుడు అతడి భార్య పూనమ్‌ నాకు చేతబడి చేసిన పదార్థాన్ని తినిపించింది. అలా నా శరీరం నా కంట్రోల్‌లో లేని సమయంలో సెక్స్‌ స్కామ్‌లో పాల్గొనేలా చేశారు. నా కన్యత్వాన్ని అమ్మి  ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాల్సిన తన కూతురు సోనాక్షి సిన్హను స్టార్‌ను చేశాడు. 2007 నుంచి 2014 వరకు నేను లోఖండ్‌వాలాలోని ఫ్యామిలీ అపార్ట్‌మెంట్‌లోనే నివసించాను. సిన్హ కుటుంబం పై పోర్షన్‌లో ఉండేవారు. నేను సింగపూర్‌కు షాపింగ్‌కు వెళ్లి తిరిగొచ్చే సమయానికి గదిలో నా వస్తువులు కనిపించకుండా పోయేవి. వాటిని ఫొటోషూట్లలో వాడుకోమని సోనాక్షి సిన్హాకు అప్పగించేవారు. కేవలం అతడి వల్లే నేనింకా పెళ్లి చేసుకోలేదు. నాకు డ్రగ్స్‌ ఇచ్చి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాడు. నా కెరీర్‌ నాశనమైందంటే అది కేవలం శత్రుఘ్న సిన్హా వల్లే!' అని ఆరోపించింది పూజా.

చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?

ఈ ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హ స్పందించాడు. ఆమెకు వృత్తిపరంగా సహాయం కావాలనుకుంటా. నా కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నప్పుడే ఆమె మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి చెత్త కథనాలపై స్పందించి సమయం వృథా చేసుకోను. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కథనాలు రాసేవాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను ట్వీట్‌ చేశాడు. ఏదేమైనా పూజా మిశ్ర ఆరోపణలు మాత్రం సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఎవరీ పూజా మిశ్ర
పూజా మిశ్ర వీడియో జాకీ, నటి, మోడల్‌. హిందీ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లోనూ పూజా పాల్గొంది. అమ్మ, డ్రీమ్స్‌: ద మూవీ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.

చదవండి: సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement