
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు శత్రుఘ్న సిన్హా. సొంత పార్టీ నాయకుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే ఈ సీనియర్ స్టార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఓ బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా మీటూ ఉద్యమం పై స్పందించారు. ‘మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఈ వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం సంశయించటం లేదు. విజయవంతమైన ప్రతీ వ్యక్తి పడిపోవటం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది. మీటూ వివాదంలో నా పేరు వినిపించకపోవటం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment