నితీశ్ ఓ.. డి..పో.. 'ఖామోష్..'! | Shatrughan Sinha casted his vote in patna | Sakshi
Sakshi News home page

నితీశ్ ఓ.. డి..పో.. 'ఖామోష్..'!

Published Wed, Oct 28 2015 4:47 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

నితీశ్ ఓ.. డి..పో.. 'ఖామోష్..'! - Sakshi

నితీశ్ ఓ.. డి..పో.. 'ఖామోష్..'!

'ఈ ఎన్నికల్లో ఒక వేళ నితీశ్ కుమార్ ఓడిపోతే?' అనే ప్రశ్న పూర్తి కాకముందే.. 'ఖామోష్..'అంటూ మీడియాపై నిప్పులుచెరిగారు 'షాట్గన్' శత్రుఘ్నా సిన్హా!

'తుపాకులు పేల్చకుండా చేసే యుద్ధం.. రాజకీయం' అనే నానుడి కొందరికి వర్తించదేమో! ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు తుక్కుతుక్కుగా ఓడిపోవాలని ఎన్నికల బరిలో నిల్చున్నవారు, ఆయా పార్టీల మద్దతుదార్లు కోరుకోవడం సహజం.

కానీ పొలిటీషియన్ గా మారిన యాక్టర్ శత్రుఘ్న సిన్హా మాత్రం అలాకాదు. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి సొంతపార్టీ బీజేపీపై తనవైన 'షాట్గన్'లు పేల్చుతూనే ఉన్నారాయన!

బిహార్ మూడో దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా బుధవారం పట్నాలో ఓటుహక్కును వినియోగించుకున్న శత్రుఘ్న సిన్హా.. సరదాగా కాసేపు విలేకరులతో మాట్లాడారు. 'బీజేపీ ఎంపీ అయిఉండీ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారెందుకు?' అని అడిగితే 'నేను పరిపక్వత గల (మెచ్చూర్డ్) నాయకుణ్ని. సొంతగూటిని కూల్చుకుంటానా? పప్పుల ధరలు పెరిగినందుకు ఆగ్రహించానంతే' అని చమత్కరించారు!

'ఈ ఎన్నికల్లో ఒక వేళ నితీశ్ కుమార్ ఓడిపోతే?' అనే ప్రశ్న పూర్తి కాకముందే.. 'ఖామోష్..'అంటూ మీడియాపై నిప్పులు చెరిగారు. ఇంతకీ ఆయన కమల దళం ఓడాలనుకున్నట్లా? లేక బాణం- లాంతరు గుర్తుల పార్టీలు గెలవాలనుకుంటున్నట్లా?... మీకైనా అర్థమైందా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement