సోనాక్షి సిన్హా పేరును కేవలం ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా సమాధానమిచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం దూరదర్శన్‌లో పునఃప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం వంటి కార్యక్రమాలు భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. ముకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. (వినూత్న వేషం.. 150 కిమీ నడక )
రామాయణంపై సోనాక్షిని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని, ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉందంటూ ఘూటు విమర్శలు చేశారు. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారని, సోనాక్షి వంటి కూతురుకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదని, ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. (ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు)
తన వ్యాఖ్యలపై శత్రుఘ్న ఫైర్ అవ్వడంతో తాజాగా సోనాక్షిపై చేసిన వ్యాఖ్యలను ముకేష్ ఖన్నా సమర్థించుకున్నాడు. సోనాక్షి సిన్హా పేరును ఒక ఉదాహరణగా మాత్రమే వెల్లడించానని, ఆమెను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. సోనాక్షి జ్ఙానాన్ని ప్రశ్నించలేదని, ఆమెను టార్గెట్ చేయడం తన ఉద్ధేశ్యం కాదని తెలిపారు. తన మాటలను శత్రుఘ్న తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ మధ్య (శత్రుఘ్న ) చాలా కాలం నుంచి పరిచయం ఉందని. శత్రుఘ్న పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అలాగే ‘రామాయణం, హిందూ సాహిత్యానికి సంరక్షకుడిని అని నేను అనడం లేదు. ప్రస్తుత తరం కేవలం హ్యారీ పోటర్, టిక్‌టాక్ పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. భారత పౌరుడిగా దేశ చరిత్రను, సాహిత్యాన్ని వారికి తెలియజేయడం మన కర్తవ్యం. ఇందుకు సోనాక్షి పేరును ఉపయోగించడం శత్రుఘ్న తప్పుగా భావిస్తున్నాడు. కానీ అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు’. అని తన వ్యాఖ్యాలపై సమధానమిచ్చారు. (శ్రియ భర్తకు కరోనా లక్షణాలు? )
Comments
Please login to add a commentAdd a comment