
ఆలస్యమైనా ఆమె పెళ్లిచేసుకోవడం సంతోషం
ముంబై: బాలీవుడ్ వెటరన్, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా.. నటి ఊర్మిలా మతోండ్కర్ కు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అసలు వివాహం చేసుకోకపోవడం కంటే ఆలస్యంగానైనా ఉర్మిల వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉర్మిల (42), కశ్మీరీ వ్యాపారవేత్త, మోడల్ మొహ్సిన్ అఖ్తర్ మిర్‌ను పెళ్లి చేసుకున్నారు.
ఊర్మిల, మొహ్సిన్ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని దేవుడిని కోరుకుంటున్నట్లు శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. ఉర్మిల పెళ్లికి బాలీవుడ్ నుంచి ఆమకు సన్నిహిత ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హొత్రా మాత్రమే హజరయ్యారు.