‘మోదీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ’ | Shatrughan Sinha Attacks PM Modi Again | Sakshi

‘మోదీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ’

Published Fri, Dec 1 2017 8:27 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Shatrughan Sinha Attacks PM Modi Again - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ రెబెల్‌ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ప్రధానిమోదీపై ప్రశ్నల శరంపర గుప్పించారు. దేశంలో నెలకొన్ని అత్యంత కీలకమైన సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదంటూ శత్రుఘ్నసిన్హా ప్రశ్నించారు. దేశాన్ని పీడిస్తున్న రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలపై మోదీ తక్షణం నోరు విప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘పద్మావతి’ చిత్ర వివాదం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు భద్రత తగ్గించడంపైనా మోదీ సమాధానాలు చెప్పాలని ఆయన అన్నారు. కీలక అంశాలమోదీ సమాధానాలు చెప్పి జాతికి మార్గదర్శిగా నిలవాలని ఆయన చెప్పారు.  


మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా అభివర్ణించిన... నేటి ప్రధాని మోదీ.. కీలక సమస్యలపై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement