![ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారు! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51485745780_625x300.jpg.webp?itok=SCRvJsgd)
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారు!
గువాహటి: ‘నాకు కనీసం కాంపౌండర్ అయ్యే అర్హత కూడా లేదు.. కానీ దేశానికే ఆరోగ్య మంత్రినయ్యాను’ అంటూ బాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్నసిన్హా అన్నారు. బ్రహ్మపుత్ర సాహిత్య ఉత్సవంలో మాట్లాడుతూ.. తన జీవితకథ ‘ఎనీథింగ్ బడ్ ఖామోష్’లోని పలు అంశాలను వెల్లడించారు. అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటూ మొదట్లో చాలామంది తనకు ఉచితసలహా ఇచ్చారని, అయితే, దేవానంద్ సూచన మేరకు.. ఆ ఆలోచన విరమించుకుని, తన నటనాసామర్థ్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు.
‘నా పుస్తకం బాగా అమ్ముడవుతోంది. ఇందులో సంచనాలు ఏమీ లేవు. ఈ పుస్తకంలో మహిళలను కించపరచలేదు. కానీ ఇందులో నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయ’ని శతృఘ్నసిన్హా తెలిపారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. సినిమా జీవితం వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావడం అంత సులువైన విషయం కాదన్నారు.