compounder
-
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
కాంపౌండర్ ఇక ఫార్మసిస్ట్
సాక్షి, హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆయుర్వేద, యునానీ, హోమి యోపతి విభాగాల్లోని కాంపౌండర్ పోస్టును ఫార్మసిస్టుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టు మార్పుతో వేతన పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కొత్తగా ఫార్మసిస్టుగా నియమితులయ్యే వారు ఈ విభాగాల్లో రెండేళ్ల ఫార్మసీ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో ఇదే విధానం ఉందని, భారత కేంద్ర ఔషధ మండలి నియమాలకు అనుగుణంగా ఈ మార్పులు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నారు!
గువాహటి: ‘నాకు కనీసం కాంపౌండర్ అయ్యే అర్హత కూడా లేదు.. కానీ దేశానికే ఆరోగ్య మంత్రినయ్యాను’ అంటూ బాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్నసిన్హా అన్నారు. బ్రహ్మపుత్ర సాహిత్య ఉత్సవంలో మాట్లాడుతూ.. తన జీవితకథ ‘ఎనీథింగ్ బడ్ ఖామోష్’లోని పలు అంశాలను వెల్లడించారు. అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటూ మొదట్లో చాలామంది తనకు ఉచితసలహా ఇచ్చారని, అయితే, దేవానంద్ సూచన మేరకు.. ఆ ఆలోచన విరమించుకుని, తన నటనాసామర్థ్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. ‘నా పుస్తకం బాగా అమ్ముడవుతోంది. ఇందులో సంచనాలు ఏమీ లేవు. ఈ పుస్తకంలో మహిళలను కించపరచలేదు. కానీ ఇందులో నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయ’ని శతృఘ్నసిన్హా తెలిపారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. సినిమా జీవితం వదిలిపెట్టి రాజకీయాల్లోకి రావడం అంత సులువైన విషయం కాదన్నారు. -
కూతురి మరణం: గుండెపోటుతో తండ్రి మృతి
ఓ కాంపౌండర్ చేసిన పొరపాటు.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వచ్చీరాని వైద్యంతో గర్భిణికి కాన్పు చేయడంతో ఆమె మరణించింది. పండంటి మనవడిని ఇస్తుందనుకున్న కన్నకూతురు కాస్తా శవంగా తిరిగిరావడంతో గుండెపగిలిన ఆమె తండ్రి కూడా ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన వోగిబోయిన నాగలక్ష్మి (19) అనే మహిళ కాన్పు కోసం గురువారం సాయంత్రం వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ఆమెకు కాన్పు అయ్యింది. అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో కాంపౌండర్ కాన్పు చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆ సమయంలో కాంపౌండర్ అజాగ్రత్త వల్ల బాలింతకకు అధిక రక్తస్రావం కావటంతో చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో శుక్రవారం మృతిచెందింది. ఈ వార్త విన్న నాగలక్ష్మి తండ్రి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కాంపౌండర్ కాన్పు చేయటంపై మృతురాలి బంధువులు ప్రభుత్వ వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)