
బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా
పట్నా: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో మరో నేత పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా. అయితే పార్టీ మారతారన్న వదంతులపై ఎంపీ స్పందించారు. ఆయన పట్నాలో మీడియాలో మాట్లాడుతూ.. పార్టీ మారే ఉద్దేశమే తనకు లేదని, బీజేపీకి గుడ్ బై చెప్పడం లేదని స్పష్టం చేశారు. గతంలోనూ తనపై ఇలాంటి వదంతులే వ్యాప్తి చేశారని గుర్తుచేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని బీజేపీ అధిష్టానం చెప్పడంతో శత్రుఘ్న సిన్హా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. తనపై బీజేపీ చిన్నచూపు చూస్తోందని గతంలో పలుమార్లు వ్యాఖ్యానించిన ఆయన.. ప్రస్తుతం తాను ఎక్కడికి వెళ్లనని.. బీజేపీలోనే ఉంటానని పేర్కొన్నారు. ఒకవేళ తాను బీజేపీలో లేకున్నా, ఇతర పార్టీల నుంచి టికెట్ దక్కినా పట్నా లోక్‌సభ నియోజవర్గం నుంచే బరిలోకి దిగడం ఖాయమని పలుమార్లు శ్రతఘ్న సిన్హా చెప్పకనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment