కరోనా ఎఫెక్ట్‌: మోదీపై రెబల్‌ నేత ‍ప్రశంసలు | Shatrughan Sinha Salute To Pm Modi | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : మోదీపై రెబల్‌ నేత ‍ప్రశంసలు

Published Mon, Feb 3 2020 6:53 PM | Last Updated on Mon, Feb 3 2020 7:14 PM

Shatrughan Sinha Salute To Pm Modi - Sakshi

పట్నా : బీజేపీ నేతలపై ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఎప్పూడు విమర్శల దాడి చేసే కాంగ్రెస్‌ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ఓ ఆశ్చర్యకరమైన ట్వీట్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించే ఈ రెబల్‌ నేత.. అనూహ్యంగా మోదీపై ప్రశంసలు కురిపించారు. చైనా వ్యాప్తంగా భయంకరమైన ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వుహాన్‌లో ఉన్న భారతీయులను సొంత ప్రాంతాలకు తరలించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. ప్రత్యేక విమానం బోయింగ్‌ 747 ద్వారా అక్కడున్న భారతీయులు కరోనా బారిన పడకుండా వేగవంతమైన చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై శత్రుఘ్న సిన్హా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీకి సెల్యూట్‌ అంటూ కితాబిచ్చారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. (ఢిల్లీ చేరుకున్న భార‌తీయులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement