
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా బుధవారం సమావేశమయ్యారు. మూడు దశాబ్ధాల పాటు బీజేపీతో కొనసాగిన శత్రుఘ్న సిన్హా ఏప్రిల్ 6న కాంగ్రెస్‌లో చేరనున్నారు. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించి ఆ స్ధానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో దింపింది.
బీజేపీ అగ్రనాయకత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న సిన్హా కాంగ్రెస్ నుంచి అదే స్ధానంలో పోటీ చేస్తారని భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిన్హా పార్టీ తిరిగి తనకు టికెట్ నిరాకరించడంతో తానూ అదేస్ధాయిలో బదులిస్తానని వ్యాఖ్యానించారు. మరోవైపు సిన్హాను తమ పార్టీ చిహ్నంపై పోటీ చేయిస్తామని బిహార్‌లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన ఆర్జేడీ పట్టుబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment