రాహుల్‌కు బీజేపీ ఎంపీ మద్దతు.. మోదీకి చురకలు! | Shatrughan Sinha Supports Rahul Gandhi And Criticise PM Modi | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు బీజేపీ ఎంపీ మద్దతు.. మోదీకి చురకలు!

Published Sat, May 12 2018 8:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

Shatrughan Sinha Supports Rahul Gandhi And Criticise PM Modi - Sakshi

పట్నా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతు తెలిపారు. ప్రధాని అవుతానన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. రాహుల్ అన్నదాంట్లే తప్పేంలేదని కాంగ్రెస్ అధినేతకు మద్దతుగా నిలిచారు శత్రఘ్న సిన్హా. పీఎం అవుతానని రాహుల్ చెప్పగా.. ‘పీపీపీ అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

‘సార్.. రాహుల్‌కు ప్రజల్లో మంచి పేరుంది. వాళ్లు రాహుల్‌ను ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ కలకంటే మాత్రం ఆ లక్ష్యాలు సాధ్యం కావు. ప్రధాని కావాలంటే ఏ అర్హత అక్కర్లేదు. ఎవరైనా ప్రధాని కావొచ్చు. ఓ జాతీయపార్టీకి చెందిన అధినేత ప్రధాని కావాలనుకోవడంలో తప్పేంలేదు. ప్రధాని సీటును మీరు రిజిస్ట్రర్ చేసుకున్నారా. ప్రజలు మీ నుంచి అంకెలు, విశ్లేషణతో కూడిన ప్రసంగాన్ని కోరుకుంటున్నారు. అయితే మీరు  ‘పీపీపీ’ (పంజాబ్, పాండిచ్చేరి, పరివార్) అని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సముచితం కాదు. ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇలాంటివి మీ స్థాయి వ్యక్తికి తగవంటూ’  బీజేపీ అసంతృప్త నేత శత్రఘ్న సిన్హా చేసిన వరుస ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement