'రిటైర్ మెంట్ కు ఇంకా టైముంది'
పాట్నా: రాజకీయాలను నుంచి ఇప్పుడే రిటైర్ కాబోనని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూనే ఉంటానని వెల్లడించారు. రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పారు. పాలిటిక్స్ నుంచి రిటైర్ కావడానికి ఎంతో సమయం ఉందని పేర్కొన్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతారని వార్తలు వచ్చాయి.
అమితాబ్ బచ్చన్ మాదిరిగా సిన్హా కూడా పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అమితాబ్ కు తనకు పోలిక సరికాదని కొట్టిపారేశారు. తాను లోక్ సభ, రాజ్యసభలకు నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించానని గుర్తు చేశారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని 70 ఏళ్ల సిన్హా మరోసారి స్పష్టం చేశారు.