Retirement From Politics
-
వయసుపై శరద్‌పవార్ ఆసక్తిర వ్యాఖ్యలు
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్పదవార్ తన వయసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుణెలోని హవేలి తాలూకాలో జరిగిన ఎడ్లబండ్ల పరుగు పందెం పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘చాలా మందితో నా సమస్య ఏంటంటే వారంతా నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఇప్పుడు 83 ఏళ్లు. నేను ఇంకా వృద్ధున్ని కాలేదు. నాలో ఇంకా చాలా శక్తి ఉంది. ఇప్పటికీ కొంత మందిని నేను సరిచేయగలను’అని పవార్ వ్యాఖ్యానించారు. శరద్‌పవార్ వయసు పైబడిందని ఆయన రిటైర్ అవ్వాలని పవార్ మేనల్లుడు, ప్రస్తుత మహారాషష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చాలాసార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆయన మేనల్లుడికి మాటలకు కౌంటరేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. లోక్‌సభ సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్‌కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్‌లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
'రిటైర్ మెంట్ కు ఇంకా టైముంది'
పాట్నా: రాజకీయాలను నుంచి ఇప్పుడే రిటైర్ కాబోనని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూనే ఉంటానని వెల్లడించారు. రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పారు. పాలిటిక్స్ నుంచి రిటైర్ కావడానికి ఎంతో సమయం ఉందని పేర్కొన్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతారని వార్తలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ మాదిరిగా సిన్హా కూడా పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అమితాబ్ కు తనకు పోలిక సరికాదని కొట్టిపారేశారు. తాను లోక్ సభ, రాజ్యసభలకు నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించానని గుర్తు చేశారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని 70 ఏళ్ల సిన్హా మరోసారి స్పష్టం చేశారు. -
మంత్రిగారికి రాజకీయ వైరాగ్యం!
ఆయన ఐఐటీ బాంబేలో చదివిన ఉన్నత విద్యావంతుడు. ముఖ్యమంత్రిగా పనిచేసి, తర్వాత కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ చేపట్టారు. ఆ పదవి చేపట్టి సరిగ్గా ఏడాది అయ్యిందో లేదో.. అప్పుడే రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తున్నారు. ఒక్కసారి పదవి వచ్చిందంటే.. 'జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి.." అన్నట్లు కుర్చీకి అతుక్కుపోయి ఉండే నాయకులున్న ఈ రోజుల్లో తనకు 60 ఏళ్లు నిండగానే రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయనే గోవా మాజీ సీఎం, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్. పనజిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ డిసెంబర్ 13తో తనకు 60 ఏళ్లు నిండుతాయని, దాంతో రెండు మూడేళ్ల క్రితం నుంచే తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. 2012లో గోవా ముఖ్యమంత్రి అయిన పారిక్కర్‌ను 2014 నవంబర్ నెలలో మోదీ సర్కారులో రక్షణ మంత్రిగా తీసుకున్న విషయం తెలిసిందే. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలున్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కస్టం అయిపోతోందని పారిక్కర్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తన దృష్టి మాత్రం ఎప్పుడూ గోవామీదే ఉంటుందని, గోవా ప్రభుత్వం తప్పుదారి పడితే, దాన్ని మళ్లీ సరైన దారిలోకి తెస్తానని అన్నారు. ఈ విషయంపై గోవా వాసులకు గ్యారంటీ కూడా ఇస్తానని నొక్కిచెప్పారు.