శత్రుఘ్నతో కాంగ్రెస్ కీలక నేత భేటీ | Sulking BJP MP Shatrughan Sinha meets Congress leader | Sakshi
Sakshi News home page

శత్రుఘ్నతో కాంగ్రెస్ కీలక నేత భేటీ

Published Mon, Oct 19 2015 7:35 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

శత్రుఘ్నతో కాంగ్రెస్ కీలక నేత భేటీ - Sakshi

శత్రుఘ్నతో కాంగ్రెస్ కీలక నేత భేటీ

న్యూఢిల్లీ: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హాను కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. బాలీవుడ్ షాట్గన్ శత్రుఘ్నసిన్హా గత కొన్నాళ్లుగా బీజేపీకి దూరం జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుర్జేవాలా సోమవారం శత్రుఘ్న నివాసానికి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం సుర్జేవాలా స్పందిస్తూ.. తమది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు. 'శత్రుఘ్నసిన్హా అంటే నాకు ఎంతో గౌరవం. ప్రతి వ్యక్తిగత అనుబంధాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. దీనిని మీడియా మిత్రులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని సుర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు.

చిత్రరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శత్రుఘ్నసిన్హా బీహార్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. ఇందుకు కారణాలు తెలియజేస్తూ.. తాను పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ట్విట్టర్లో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement