బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీకి ఇబ్బంది కలించేలా వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీకి ఇబ్బంది కలించేలా వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రైజింగ్ స్టార్గా అభివర్ణిస్తూ మహాకూటమి నేతలు నితీశ్ కుమార్, లాలు ప్రసాద్లను మరోసారి ప్రశంసించారు.
'బిహార్లో మహాకూటమి గెలవడం ప్రజాస్వామ్య విజయం. నితీశ్ బాబు సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నితీశ్ బాబు, లాలుజీ, రైజింగ్ స్టార్ రాహుల్ గాంధీ గొప్ప విజయం సాధించారు' అని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓడిపోగా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన మహాకూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉన్న శత్రుఘ్న సిన్హా బీజేపీకి ఇబ్బంది కలిగించేలా తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు.