rising star
-
రైజింగ్ స్టార్ సీత
బాడీ షేమింగ్‌ని పట్టించుకోకుండా, ప్రతిభకు అందుతున్న ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శల తీరును గ్రహిస్తూ.. తన వ్యక్తిత్వానికి, టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటూ సాగిపోతున్న నటి.. సీత! ఆమె పరిచయమే ఇది..👉చెన్నైలో పుట్టి, పెరిగిన సీత.. ఆట, పాటల్లోనే కాదు చదువులోనూ చురుకే! తనను చూసి తనతో స్నేహం చేసిన వాళ్లకంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువగా ఉండటంతో చిన్నప్పటి నుంచీ పెద్దగా ఫ్రెండ్స్ లేకుండా పోయారు. దాంతో మనోధైర్యమే ఆమెకు ఆప్తురాలైంది.👉ఒకరోజు.. సీత తనకున్న అతికొద్ది మంది స్నేహితులతో కలిసి.. బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా, ఒకతను సీతను గమనించి, ఆమె దగ్గరకు వెళ్లి ‘నేను ఓ సినిమా తీస్తున్నాను. అందులో నటిస్తారా?’ అని అడిగాడు. అతనెవరో తనను ఆట పట్టిస్తున్నాడనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆటపట్టించడం కాదు, నిజంగానే అతను సినిమా పర్సన్ అని సీతకు .. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక తెలిసింది. అతనే.. విజయ్ మిల్టన్. ఆమె తొలిచిత్రం ‘గోలీ సోడా’ డైరెక్టర్. 👉విజయం సాధించిన ‘గోలీ సోడా’.. అంతకుముందు కెమెరాను ఫేస్ చేసిన అనుభవమే లేని సీతకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన విజయ్ మిల్టన్ తన తర్వాత సినిమా ‘10 ఎండ్రాతుకుళ్లా’లోనూ అవకాశం ఇచ్చాడు. అలా ప్రభుదేవా నటించిన ‘చార్లీ చాప్లిన్’ తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది. 👉 వెండితెర అవకాశాల్ని అందించిన పాత్రే నన్ను వెబ్ ప్రపంచానికీ పరిచయం చేయడం సంతోషం. నిజానికి ఆ రోల్.. నా లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. నా ఫిజికల్ అపియరెన్స్ గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతా!👉‘గోలీ సోడా’కు సీక్వెల్‌గా తీసిన ‘గోలీ సోడా – ద రైజింగ్ ’ వెబ్‌సిరీస్‌తో సీత ఓటీటీలోకీ ఎంటర్ అయింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. – సీత. -
‘రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా వివేక్ సాగర్
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో ఇటీవల విశేషంగా రాణిస్తోన్న యువ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తించింది. 2019 ఏడాదికిగానూ ఎఫ్ఐహెచ్ ‘ రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్‌ను ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో 19 ఏళ్ల వివేక్ సాగర్ విజేతగా నిలవగా... మైకో కాసెలా (అర్జెంటీనా), బ్లేక్ గోవర్స్ (ఆస్ట్రేలియా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా వివేక్ సాగర్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందించారు. 2018లో 17 ఏళ్ల వయస్సులో వివేక్ సాగర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2019లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ సిరీస్ ఫైనల్స్ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలోనూ వివేక్ సాగర్ కీలక పాత్ర పోషించాడు. -
రాహుల్ రైజింగ్ స్టార్: శత్రుఘ్న సిన్హా
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీకి ఇబ్బంది కలించేలా వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రైజింగ్ స్టార్‌గా అభివర్ణిస్తూ మహాకూటమి నేతలు నితీశ్ కుమార్, లాలు ప్రసాద్‌లను మరోసారి ప్రశంసించారు. 'బిహార్‌లో మహాకూటమి గెలవడం ప్రజాస్వామ్య విజయం. నితీశ్ బాబు సారథ్యంలోని కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నితీశ్ బాబు, లాలుజీ, రైజింగ్ స్టార్ రాహుల్ గాంధీ గొప్ప విజయం సాధించారు' అని శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓడిపోగా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉన్న శత్రుఘ్న సిన్హా బీజేపీకి ఇబ్బంది కలిగించేలా తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు.