తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు.
1/9
ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయి ఎద్దులేని ఎవుసంగా మారింది. అయితే కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కొందరు రైతులు ఎడ్లు, నాగళ్లను వదిలేయలేదు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి శివారులో ఓ పక్క ట్రాక్టర్‌తో దున్నుతూ విత్తనం వేస్తుండగా, మరోపక్క ఎద్దునాగలితో దున్నుతూ విత్తనం వేశారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. – సాక్షి, కామారెడ్డి
2/9
యాదాద్రి ప్రధానాలయం ప్రథమ ప్రాకార మండపంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత తదితరులు
3/9
తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలంపాటను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
4/9
బుధవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్న నేపథ్యంలో ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ వద్ద శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
5/9
రైల్వేట్రాక్‌లపై వరదలొస్తే ప్రయాణికులను ఎలా రక్షించాలనే అంశంపై మంగళవారం మహారాష్ట్రలోని థానేలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది
6/9
ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి మొసలి మంగళవారం వాగ్లే ఎస్టేట్ సమీపంలోని చెరువులో దొరికింది. వన్య ప్రాణుల సంక్షేమ సంఘానికి చెందిన ఓ సభ్యుడు దీన్ని రక్షించాడు. వైద్య పరీక్షల అనంతరం మొసలిని జూకు తరలించనున్నారు
7/9
ముంబైలో ‘మేక్ ఎర్త్ గ్రీన్ ఎగైన్ ఫౌండేషన్’ పిలుపు మేరకు మంగళవారం మొక్కను నాటుతున్న బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా, ఆయన భార్య పూనమ్ సిన్హా, కూతురు సోనాక్షి సిన్హా
8/9
దక్షిణాఫ్రికాలోని క్వాజులు–నటాల్ ప్రావిన్స్ క్వాహ్లతి గ్రామం వద్ద వజ్రాలు లభిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో ప్రజలంతా ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరుపుతున్నారు
9/9
చైనాలోని హుబే ప్రావిన్స్ వూహాన్‌లోని సెంట్రల్ చైనా నార్మల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన స్నాతకోత్సవానికి 11 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కోవిడ్ కారణంగా గత ఏడాది స్నాతకోత్సవాలకు హాజరు కాలేకపోయిన 2వేల మంది విద్యార్థులు కూడా ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment