
గోతిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు, స్థానికులు కలిసి కాపాడారు. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో యాదాద్రి హరిత శోభను సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ముంబైకర్ల పాట్లు రెట్టింపయ్యాయి.

హిమాయత్‌సాగర్ రోడ్డులో బుధవారం సీసీ రోడ్డు పైనుంచి వెళుతున్న ఓ కారు అదుపు తప్పింది. టైరు రోడ్డు కిందకు దిగటంతో ఎటూ కదలలేకపోయింది. అదే సమయంలో అదనపు డీజీ (రోడ్డు భద్రత) సందీప్ శాండిల్య కారులో శంకర్‌పల్లి వెళ్తూ దిగబడిన కారును గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి గన్‌మెన్ల సహాయంతో దానికి పైకి ఎత్తించారు. అక్కడివారంతా శాండిల్య కారుణ్యానికి ముగ్దులయ్యారు.

చుట్టూ మొక్కలు.. విశాలమైన పచ్చికబయళ్లు.. దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాలతో కొండచుట్టూ నెలకొన్న చెట్ల పచ్చదనం.. వెరసి యాదాద్రికొండ హరితమయంగా మారింది. కొండకు దిగువన దక్షిణ భాగంలో నాటిన పూల మొక్కలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండపై ఉత్తర రాజగోపురం ముందు భాగంలో పెంచిన పచ్చిక, మొక్కలు పచ్చదనంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. – యాదగిరిగుట్ట

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా ఇదివరకు సాధారణ ప్రాంతమే.. కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ అనంతరం పట్టణానికే తలమానికంగా మారింది. కోర్టు చౌరస్తా కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాగా మారిన తర్వాత రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య ఇలా చూపరులను ఆకట్టుకుంటోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కుట్టంపుజా ప్రాంతంలో గజరాజు ఓ గోతిలో పడిపోయింది. అటవీ శాఖ అధికారులు బుధవారం స్థానికుల సహాయంతో ఏనుగును క్షేమంగా బయటకు తీశారు.

రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం క్రమంగా తొలగిస్తోంది. చరిత్రాత్మక అజ్మీర్ కోటను సందర్శల కోసం బుధవారం నుంచి తెరిచారు.

భారీ వర్షానికి ముంబైలోని హిందూమాత వద్ద మ్యాన్‌హోల్ ఉన్న ప్రాంతం మునిగిపోవడంతో డేంజర్ గుర్తును పెట్టి వాహనదారులకు దిశానిర్ధేశం చేస్తున్న బీఎంసీ ఉద్యోగి

కరోనా బాధితుల కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న అహ్మద్ షా సమాధి ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగిస్తున్న దృశ్యం

పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా బుధవారం ములుండ్‌లో బాబా రాందేవ్, అమితాబ్, అక్షయ్ తదితర సెలెబ్రెటీల మాస్కులు ధరించి ఆందోళన చేస్తున్న ఉత్తర ముంబై కాంగ్రెస్ కార్యకర్తలు

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం నవీముంబైలోని ఎన్‌ఎంఎంసీ మీనాతాయ్ ఠాక్రే ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లో టీకా వేయించుకుంటున్న ఓ విద్యార్థిని

భక్తి పారవశ్యం నొప్పిని జయించింది. చెంపలకు కడ్డీలు కుచ్చుకుని మొక్కు తీర్చుకోవడానికి ఆలయానికి వెళ్తున్న యువతి. బుధవారం బెంగళూరు హడ్సన్ కూడలిలో అన్నమ్మదేవి జాతర సందర్భంగా మొక్కు తీర్చుకోవడానికి ఊరేగింపుగా వెళ్తున్న ఓ కుటుంబం. – సాక్షి, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment