![Shatrughan Sinha Appreciation For CM YS Jagan Mohan Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/8/YS-Jagan.jpg.webp?itok=9zXWZ1vT)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా ప్రశంసించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా దీనిని అమలు చేయాలంటూ ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో కరోనా చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని, ఇది సరైన సమయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు.
నిజంగా ఇది అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడే నిర్ణయమన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇతరులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ బాటను అనుసరిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment