'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా' | Sonakshi Sinha scared of reading through her fathers biography | Sakshi
Sakshi News home page

'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా'

Published Sat, Feb 20 2016 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా'

'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా'

తన తండ్రి శత్రుఘ్న సిన్హా జీవితకథను చదివేందుకు తాను చాలా భయపడ్డానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలిపింది. బీజేపీ ఎంపీ, అలనాటి కథనాయకుడు అయిన శత్రుఘ్న జీవితకథను 'ఎనిథింగ్ బట్ ఖమోష్: ద శత్రుఘ్న సిన్హా బయోగ్రఫీ' పేరిట భారతీ ఎస్ ప్రధాన్‌ రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని శుక్రవారం లాంఛనంగా ముంబైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ 'నేను ఈ పుస్తకం చదివేందుకు చాలా భయపడ్డాను. తల్లిదండ్రుల జీవితాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఎప్పుడూ పిల్లలకు తెలియకపోవడమే మంచిది' అని ఆమె అన్నారు.

నిజజీవితంలో రీనా రాయ్‌తో శత్రుఘ్న సాగించిన ప్రేమాయణం, పూనంను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్నాళ్లు ఆమెతో సంబంధం కొనసాగించిన అంశం గురించి ఈ పుస్తకంలోని ఓ అధ్యాయంలో చర్చించినట్టు తెలుస్తోంది. నటుడు కాకముందు వరకు శత్రుఘ్న జీవితకథను తాను ఆసాంతం చదివానని, ఆ తర్వాత ముందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. బాల్యం, యవ్వన ప్రారంభం రోజులు, కాలేజీ రోజుల వరకు ఆయన జీవితకథను చదివానని, నటుడైన తర్వాతి అధ్యాయాలను మాత్రం చూడలేదని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement