న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డీఎన్ఏపై తప్పుడు ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని నేను భావించడం లేదని, అయినా.. ఆ మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేదని బీజేపీ సీనియర్ నేత శత్రఘ్నసిన్హా అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. ఇటీవల నితీశ్కుమార్తో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమవడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
స్నేహాన్ని, మిత్రులను రాజకీయాలతో ముడిపెట్టకూడదని చెప్పారు. నితీశ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, మంచి ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరని చెప్పారు. ప్రధాని మోదీ కేబినెట్లోకి మిమ్మల్ని తీసుకోకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారా అని ప్రశ్నించగా.. ఒక్క అనుభవం మాత్రమే ఉంటే ప్రధాని కేబినెట్లో చోటుదక్కుతుందని తాను అనుకోవడం లేదని చెప్పారు.
'దాని గురించి పట్టించుకోనవసరం లేదు'~
Published Wed, Sep 9 2015 9:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement